Indian Army: సరిహద్దుల్లో రహస్య సొరంగం గుర్తింపు
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
Indian Army: 150 ft tunnel found along Pakistan border in J&K: జమ్ము: పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్ (Jammu Kashmir) లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని (150 ft tunnel) బీఎస్‌ఎఫ్ (BSF) జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు. 2.5 మీటర్ల వెడల్పుతో, 25 నుంచి 30 మీటర్ల లోతులో ఈ సొరంగం ఉందని.. బయట వైపు గడ్డితో కప్పి ఉన్నట్లు చెప్పారు. అయితే అక్కడ లభించిన ఇసుక బస్తాలు పాక్‌లోని కరాచీలో తయారయ్యాయని ఆయన పేర్కొన్నారు. అయితే.. నగ్రోటా సమీపంలోని బాన్ టోల్‌ప్లాజా దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్ (Nagrota encounter) లో హతమైన నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ సొరంగ మార్గం ద్వారానే భారత్‌లోకి చొరబడి ఉంటారని దిల్‌బాగ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. Also read: J&K: జమ్మూలో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం
[[{"fid":"198826","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ఇండియన్ ఆర్మీ","field_file_image_title_text[und][0][value]":"భారీ సొరంగాన్ని కనుగొన్న ఇండియన్ ఆర్మీ"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ఇండియన్ ఆర్మీ","field_file_image_title_text[und][0][value]":"భారీ సొరంగాన్ని కనుగొన్న ఇండియన్ ఆర్మీ"}},"link_text":false,"attributes":{"alt":"ఇండియన్ ఆర్మీ","title":"భారీ సొరంగాన్ని కనుగొన్న ఇండియన్ ఆర్మీ","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఎన్‌కౌంటర్ తర్వాత నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దులో టెన్నెల్‌ల ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. మరోవైపు పాకిస్తాన్ (Pakistan) నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది. తాజాగా కతువా, రాజౌరి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలు, సైనిక పోస్టులు లక్ష్యంగా మోర్టార్లతో దాడులు చేయగా.. భారత్ బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే జమ్మూకశ్మీర్‌లో త్వరలో జరగనున్న డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (DDC) ఎన్నికలను విచ్ఛిన్నం చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని.. అందులో భాగంగా వీరు భారత్‌లోకి ప్రవేశించినట్టు పోలీసులు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 8 విడతలుగా ఎన్నికలు జరగనుండగా, తొలి విడత పోలింగ్ ఈ నెల 28న జరగనుంది.
Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి